తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం "అర్జున్ రెడ్డి". ఈ చిత్రాన్ని కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్‌లోకి రీమేక్ చేశారు. ఈ చిత్రం జూన్ 21వ తేదీన విడుదల చేయగా, తొలి రోజునే రూ.12.21 కోట్లను కలెక్ట్ చేసింది.
అలాగే రెండో రోజైన శనివారం రూ.17.10 కోట్లు, మూడో రోజైన ఆదివారం రూ.17.84 కోట్లు చొప్పున కలెక్ట్ చేసింది. ఈ వివరాలను బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. కాగా, ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.