''జెర్సీ''పై కన్నేసిన కబీర్ సింగ్.. సీన్‌లోకి కరణ్ జోహార్..!?

మంగళవారం, 25 జూన్ 2019 (12:41 IST)
బాలీవుడ్ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అర్జున్ రెడ్డి రీమేక్ బాలీవుడ్‌లో భారీగానే వసూళ్లు చేస్తోంది. ఈ సినిమా తెలుగులో విడుద‌లై రెండేళ్లు గ‌డిచినా కూడా ఇప్ప‌టికీ అర్జున్ రెడ్డి పేరు మారుమోగిపోతోంది. 
 
హిందీలో ఈ సినిమాకు కాస్త యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా కూడా క‌లెక్ష‌న్లు మాత్రం అదిరిపోతున్నాయి. మూడు రోజుల్లో ఈ చిత్రం ఏకంగా రూ.71 కోట్లు వ‌సూలు చేసింది. అది కూడా భారత్‌లో మాత్రమే. ఓవర్సీస్‌ల్లో కలుపుకుంటే.. రూ.90కోట్లకు పైగా వుంది.
 
ఈ నేపథ్యంలో కబీర్ సింగ్ మరో తెలుగు సినిమాకు రీమేక్ చేయనున్నాడు. నేచురల్‌ స్టార్ నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్‌ స్పోర్ట్స్ డ్రామా జెర్సీ. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా సూపర్‌ హిట్ టాక్‌ సాధించినా వసూళ్ల పరంగా వెనకపడింది. 
 
అయితే నాని నటన, గౌతమ్‌ టేకింగ్‌ మాత్రం విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాపై బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కన్నుపడింది. ఇప్పటికే కరణ్‌ జెర్సీ రీమేక్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
 
అంతేకాదు ఒరిజినల్‌ వర్షన్‌ను తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలోనే రీమేక్‌ను కూడా రూపొందించే ఆలోచనలో ఉన్నాడట కరణ్‌. ఈ సినిమాలో షాహిద్‌ కపూర్ హీరోగా నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు