కొరియోగ్రాఫర్, ప్రముఖ దర్శకుడు రాఘవ లారెన్స్ నటిస్తూ, దర్శకత్వం వహించిన కాంచన-3 సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇప్పటికే దాదాపుగా 100 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసిందనేది ట్రేడ్ టాక్. తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 19వ తేదీన ఈ సినిమా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 2600 థియేటర్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేశారు.