కాగా, వీరిద్దరి మధ్య 2016 నుంచి నకిలీ ఈ-మెయిల్ వ్యవహారం సాగుతోంది. ఈ కేసులో హృతిక్ రోషన్‌ను తమ కార్యాలయానికి పిలిపించిన ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగం, శనివారం అతని వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
గత సంవత్సరం డిసెంబరులో పెండింగ్‌లోని నకిలీ ఈమెయిల్స్‌ను దర్యాఫ్తు చేయాలని హృతిక్ తరపు న్యాయవాది ముంబై పోలీసు కమిషనర్‌ను కలసి విన్నవించగా, ఆపై ఈ కేసు విచారణను క్రైమ్ బ్రాండ్‌కి బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
హృతిక్, కంగనాల మధ్య ఐదేళ్ల క్రితం వరకూ నడిచిన ప్రేమ వ్యవహారం, 2016లో కోర్టుకు ఎక్కింది. కంగన చేసిన ఆరోపణలన్నింటినీ గతంలోనే హృతిక్ తోసిపుచ్చాడు. తన పేరిట ఎవరో నకిలీ ఖాతాను సృష్టించి, కంగనకు ఈ-మెయిల్స్ పంపాడన్నది హృతిక్ వాదన. వీటితో తనకేమీ సంబంధం లేదని హృతిక్ చెబుతుండగా, మొత్తం వాస్తవాలు విచారణలో బయటకు వస్తాయని కంగన నమ్మకంగా అంటోంది.