బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ తొలిసారి తన పెళ్లిపై స్పందించారు. త్వరలోనే శుభవార్త చెబుతానని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, రాబోయే ఐదేళ్లలో ఎలా కనిపించబోతున్నారు అని ప్రశ్నలు సంధించగా, దానికి ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
ఉక్కు మహిళ అయిన ఇందిరా గాంధీ జీవితానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుని కథను రూపొందించే పనిలో కంగన అండ్ టీమ్ వర్క్ చేస్తుంది. కాగా, రీసెంట్‌గా కంగనా రనౌత్.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత చరిత్ర నేపథ్యంలో "తలైవి" చిత్రంతో పలకరించారు.