బాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్స్ జాబితాలో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో పాటు.. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఒకరు. 44 ఏళ్ల కరణ్.. తన కెరీర్‌గ్రాఫ్‌లో మంచి హిట్ అందుకొన్న రొమాంటిక్ సినిమాలు తీశాడు. కానీ తన జీవితంలో ప్రేమకి మాత్రం చోటులేకుండా పోయింది. ఈ విషయాలన్నీ కరణ్ ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో వెల్లడించారు.
అయితే, ప్రతి ఒక్కరూ నువ్వున్న స్థానంలో నిన్ను ఏ అమ్మాయి కాదనదు అంటుంటారు. ఏ స్థానం గురించి వారు మాట్లాడుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావడంలేదు. ఒకమ్మాయిని చూసి ఇష్టపడిన ప్రతీసారి నాకు చేదు అనుభవమే ఎదురైంది. నా 44 ఏళ్ల జీవితంలో ఒంటరితనమే ఎక్కువగా ఉంది' అంటూ తన సింగిల్ లైఫ్ గురించి వివరించారు కరణ్. కరణ్ ఆఖరిగా 'యే దిల్ హై ముష్కిల్' సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచిన విషయం తెల్సిందే.