కళాధర్ కొక్కొండ, మోనా ఠాకూర్, ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, అజయ్, దిల్ రమేష్ నటీ నటులుగా కళాధర్ కొక్కొండ స్వీయ దర్శకత్వంలో తనే హీరో గా నటిస్తున్న చిత్రం "కర్ణ". ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 23న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేస్తున్న సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ అనిల్ కుర్మాచలం, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.