తోటివారు ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారు కదా మీకెందుకు కష్టం అని అడిగితే.. "ఎక్స్‌పోజింగ్ అనేది వారిష్టం. నిత్యామీనన్ ఈ విషయంలో నాకు ఆదర్శం. తను అందాల ఆరబోతకు దూరంగా ఉంటుంది. అయినా తనకు మంచి సినిమాలు, మంచి పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని కీర్తి సురేష్ తెలిపింది.
ఏ రోల్‌లో నటించినా భవిష్యత్తులో తన భర్త, పిల్లలతో కలిసి కూర్చుని చూసే సినిమాలే చేస్తానే కానీ.. వారి ముందు తలదించుకుని కూర్చునే సినిమాలే చేయనని కీర్తి సురేష్ వెల్లడించింది. ఇంకా అమ్మే తనకు ఆదర్శం. తన కెరీర్‌లో ఎప్పుడూ ఎక్స్‌పోజింగ్ కానీ, మితిమీరిన గ్లామర్ రోల్స్ కానీ చేయలేదని కీర్తి సురేష్ తెలిపింది.