రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’. ‘ప్లే స్మార్ట్’ అనేది ఉపశీర్షిక. మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లు. ఇటీవల విడుదలైన ‘ఖిలాడి’ టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. దీంతో ‘ఖిలాడి’ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో కూడా అంచనాలు పెరిగిపోయాయి. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ‘ఖిలాడి’ సినిమా హవిష్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ పతాకాలపై కోనేరు సత్యానారాయణ నిర్మిస్తున్నారు.