శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌ని ఇచ్చిన రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్.. ఖైదీకి కూడా సంగీతం సమకూర్చడం సినిమా ప్లస్ అయ్యింది. ఈ క్రమంలో 70లక్షల గ్రాస్‌ను బాస్ పాట కైవసం చేసుకుంది. ఇంతకీ విషయం ఏమిటంటే? 70 లక్షల మంది ''ఖైదీనంబర్ 150''లోని 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' ఆడియో సాంగ్‌ని విన్నారు. అంటే బాస్ క్రేజు ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు.
లహరి మ్యూజిక్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ మూవీ ఖైదీ నెం.150 ఆడియో విడుదలైంది. ఈ ఆడియోకి శ్రోతల నుంచి విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఈ సందర్భంగా లహరి మ్యూజిక్ అధినేత మనోహర్‌నాయుడు స్పందిస్తూ- చిరంజీవిగారి మాస్టర్, హిట్లర్, మెకానిక్ అల్లుడు, ముఠామేస్త్రి, ఆపద్బాంధవుడు, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, ముగ్గురు మొనగాళ్ళు వంటి బ్లాక్‌బస్టర్ ఆడియోలను మా సంస్థ ద్వారానే రిలీజ్ చేశాం.
ఇప్పటికే విడుదలైన ఖైదీ పాటల్లో 'అమ్మడు.. కుమ్ముడు..' పాటకు 7 మిలియన్ వ్యూస్ క్రాస్ కాగా, 'సుందరీ..' పాట 4 మిలియన్ వ్యూస్‌కి చేరుకుంటుండగా, 'యు అండ్ మి' పాట 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ చిత్రంలోని 'రత్తాలు..రత్తాలు..' అనే ఐటమ్ సాంగ్‌ను డిసెంబర్ 31న విడుదల చేస్తున్నాం.