చిరంజీవి సర్జాకు జూనియర్ వచ్చేశాడోచ్.. మేఘనకు పండంటి మగబిడ్డ...

గురువారం, 22 అక్టోబరు 2020 (18:04 IST)
కన్నడ ప్రముఖ హీరో చిరంజీవి సర్జా ఇటీవలే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. చిరంజీవి సర్జా మరణం అందరిలోను తీవ్ర విషాదం నింపింది. 36 ఏళ్ల వయసులోనే చిరంజీవి ఆకస్మిక మరణం అందరిని కలిచివేసింది. ఆయన అకాల మరణం చెందినప్పుడు తన భార్య మేఘానా రాజ్ నిండు గర్భిణి.
 
భర్త లేని లోటు ఆమెను కుంగదీసింది. ఇటీవలే చిరంజీవి సర్జా కటౌట్ సమక్షంలో ఆమెకు సీమంతం కూడా జరుపుకున్నారు. ఆ ఫొటోలు చూసిన అభిమానులు అంతా కన్నీళ్ల పర్యంతం అయ్యారు.
 
ఇపుడు తాజాగా చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తన అన్నయ్యే మళ్లీ పుడుతాడంటూ అంటూ చిరంజీవి సర్జా సోదరుడు ధృవ సర్జా తెలిపిన మాట నేడు నిజమైంది. ఇటీవల ధృవ సర్జా వెండి ఉయ్యాల కూడా చేయించిన సంగతి తెలిసిందే. 
 
చిరంజీవి సర్జా లేకపోయినా ఆయన కుటుంబ సభ్యులు మేఘనను కంటికి రెప్పలా చూసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మేఘనకు మగ బిడ్డకు జన్మనిచ్చింది.. ఇంకో విశేషం ఏంటంటే నేడు చిరంజీవి-మేఘనల ఎంగేజ్‌మెంట్ డే కూడా. దీంతో చిరంజీవి సర్జా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు