మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "ఆచార్య". కొరటాలశివ దర్శకుడు. 80 శాతం మేరకు షూటింగ్ పూర్తయింది. కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రంలోని మిగిలిన షూటింగ్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలన్న భావనలో చిత్ర యూనిట్ వుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత చిరంజీవి తన 153వ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇది మలయాళ చిత్రం "లూసిఫర్"కు రీమేక్.
అయితే, ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతల నుంచి తమిళ దర్శకుడు మోహన్ రాజా తప్పుకున్నారంటూ గత రెండు రోజులుగా ప్రచారం జరిగింది. చిరంజీవి అండ్ టీమ్ మరో దర్శకుడిని వెతికే పనిలో ఉన్నారన్నట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేశాయి. దీనిపై ఇపుడు ఓ క్లారిటీ వచ్చింది.