"ఉప్పెన" చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన నటి కృతిశెట్టి. ఈ ఒక్క చిత్రంతో ఈ అమ్మడు దశ రాత్రికి రాత్రే మారిపోయింది. దీంతో ఈమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అలాంటి కృతిశెట్టి ప్రస్తుతం ఓ స్టార్ డైరెక్టర్‌కు నో చెప్పినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వార్త ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో, ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరోయిన్ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. చేతిలో అరడజను సినిమాలున్నాయని సమాచారం. నానితో "శ్యామ్ సింగ రాయ్", సుధీర్ బాబు, రామ్ పోతినేనిలతో ఒక్కో సినిమాలు చేతిలో ఉన్నాయి.