శ్రీరెడ్డి ప్రధానంగా నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్, స్టార్ రైటర్ కోన వెంకట్‌లపై ఆరోపణలు చేస్తూ ఓ ఫోటోను లీక్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, కొన్ని టీవీ ఛానెళ్లలోనూ పదేపదే చూపించారు. ఈ విషయంపై దగ్గుబాటి ఫ్యామిలీ స్పందించలేదు కానీ.. కోన వెంకట్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తనకు ఏ పాపం తెలియదని.. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు.
కోన వెంకట్, అభిరామ్ గురించి స్పందించాలని విలేకరులు కోరారు. దీంతో శివాజీ రాజా మాట్లాడుతూ కోన వెంకట్‌తో మాకు సంబంధం లేదు.. రైటర్స్ అసోసియేషన్ అనేది ఉంది. ఆ విషయం వాళ్లు చూసుకుంటారు. ఇక అభిరామ్ దుగ్గుబాటి నటుడు కాదు, నిర్మాత కాదు, మాకు సంబంధం లేని విషయం అది అంటూ చాలా తెలివిగా శివాజీ రాజా సమాధానం చెప్పి తప్పించుకున్నారు.