సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ భారీ చిత్రంలో మహేష్ సరసన పూజా హేగ్డే నటిస్తే... కీలక పాత్రలో అల్లరి నరేష్ నటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మహేష్.. సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ... మహర్షి.. ఇట్స్ ఎ ర్యాప్ అని కేక్ పైన రాసున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
‘మిమ్మల్ని మే 9న థియేటర్లలో చూస్తాను’ అని క్యాప్షన్ ఇచ్చారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అశ్వనీదత్, దిల్ రాజు, ప్రసాద్ వి పొట్లూరి సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఎవరెస్ట్ అంచున’ అని సాగే పాట వీడియో ప్రివ్యూను శుక్రవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలియచేసింది. భరత్ అనే నేను సక్సస్ తర్వాత వస్తున్న సినిమా కావడం... ఇది మహేష్‌కి 25వ సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. మరి..మహర్షి అంచనాలను అందుకుంటుందో లేదో..?