మహేష్ బాబు మాతృమూర్తి ఘట్టమనేని ఇందిరాదేవి ఇకలేరు

బుధవారం, 28 సెప్టెంబరు 2022 (08:00 IST)
Ghattamaneni Indira Devi
ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి, సూపర్ స్టార్ మహేష్ బాబుగారి తల్లి శ్రీమతి ఘట్టమనేని ఇందిరాదేవి గారు కొద్దిసేపటి కిందట కన్నుమూశారు. ఇందిరాదేవి గారు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు అభిమానులు సందర్శన కోసం ఆమె పార్ధివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచి అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుపనున్నారు

 
చిరంజీవి సంతాపం
ఇందిరాదేవి గారు మ‌ర‌ణం ప‌ట్ల సినీరంగం ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. ఈరోజు జ‌ర‌గాల్సిన ప‌లు కార్య‌క్ర‌మాలు వాయిదా ప‌డ్డాయి. మెగాస్టార్ చిరంజీవి త‌న సంతాప‌సందేశాన్ని ఇలా తెలియ‌జేశారు.
 
శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ  సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబుకి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు