"పాస్‌బుక్‌లో పైసల కన్నా ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ ఎక్కువ" అనే ఈ పాటలోని రెండు లైన్లను నాని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంటూ ఈ పాటను విడుదల చేశాడు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ''ఫిదా'' సినిమా హీరోయిన్ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇంకా ప్రముఖ హీరోయిన్ భూమిక ఇందులో కీలకపాత్ర పోషిస్తోంది. ఎంసీఎ మూవీ తప్పకుండా అందరినీ ఆకట్టుకోవడమే కాదు, ప్రేక్షకుల్లో తమ బ్యానర్ వాల్యూను పెంచే చిత్రమవుతుందని సినీ యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వున్న నాని ఎంసీఏ డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.