ముహూర్తపు సన్నివేశానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమానికి మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, యువీ క్రియేషన్స్ వంశీ, దామోదర్ ప్రసాద్, నందినీ రెడ్డి, రాధా మోహన్, కార్తీక్ వర్మ, సుబ్బు, మిర్యాల రవీందర్ రెడ్డి, కోన వెంకట్, నీరజ కోన తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ భాస్కర్ డైరెక్టర్గా సిద్ధు జొన్నలగడ్డతో మా బ్యానర్లో సినిమా చేయటం ఎంతో హ్యాపీగా ఉంది. అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉంటుంది. హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అన్నారు.