'సూర్యకాంతం'గా మెగా డాటర్

శుక్రవారం, 25 జనవరి 2019 (09:57 IST)
మెగా డాటర్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ నిహారిక. ఈమె గతంలో నటించిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. కానీ నిహారిక నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆమె "సూర్యకాంతం" పేరుతో ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
దర్శకుడు ప్రణీత్ బ్రమండపల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టంట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజయ్ నిహారిక‌కు జోడీగా నటిస్తున్నాడు. నిర్వాణ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చిలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 
 
ఇటీవల ఫ‌స్ట్ లుక్‌తో అంచ‌నాలు పెంచిన చిత్ర యూనిట్ శుక్రవారం టీజ‌ర్‌ని విడుద‌ల చేసి మూవీపై మ‌రింత హైప్ తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాబిన్ మార్క్ సంగీతం అందిస్తున్నారు. మ‌రోవైపు నిహారిక నూత‌న ద‌ర్శ‌కురాలు సుజ‌నా తెర‌కెక్కించ‌నున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంలోనూ నటించనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు