Panchatantra Lyrical song
టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ పతాకంపై కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, మత్తు వదలరా ఫేమ్ నరేష్ అగస్త్య నటీనటులుగా హర్ష పులిపాక ను దర్శకుడిగా పరిచయం చేస్తూ అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'పంచతంత్రం''.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్భంగా ఈ చిత్రంలోని "అరెరే అరెరే మాటే..రాదే..మనసే పలికే క్షణములో"... లిరికల్ వీడియోను సెన్సేషల్ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు