పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హాస్యనటుడు అలీలు మళ్లీ కలిసి నటించబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం పవన్ వరుసగా మూడు సినిమాల్లో నటించేందుకు సంతకాలు చేసేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను నటిస్తున్న సినిమాల్లో అలీని తీసుకోవాలని దర్శకనిర్మాతలకు పవన్ చెప్పినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
అలీకి స్వయంగా పవనే ఫోన్ చేసి తన సినిమాలో నటించాలని కోరారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కోరిన వెంటనే అలీ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతానికి రాజకీయ వైరుధ్యాలను పక్కనబెట్టి.. సినిమాల హిట్ కోసం పవన్-అలీ కలిసి నటించబోతున్నారని సమాచారం. ఈ వార్త పవన్ ఫ్యాన్సుకు పండగ చేసుకునేదే అవుతుందని సినీ పండితులు చెప్తున్నారు.