అంతకుముందు, సుప్రీత బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్‌ల కోసం రీల్స్ చేసింది. ఆపై వాటిని తొలగించి, తన కుమార్తెతో పాటు రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటోను అప్లోడ్ చేసి సురేఖా వాణి.. ఆయనను అభినందించింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఇది జరిగింది.
బీఆర్ఎస్ అధికారంలో వుండగా.. ఆ పార్టీకి మద్దతిచ్చి.. ఇప్పుడు అధికారం మారగానే రేవంత్ రెడ్డి ఫోటోను సురేఖ పోస్టు చేసిందని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఆమె అవకాశవాద వ్యక్తి అని ట్రోల్స్ మొదలెట్టారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. నెటిజన్ల ట్రోల్స్‌తో మానసికంగా కుంగిపోయానని తెలిపింది. కొత్త సీఎంను అభినందించడం తప్పుకాదని తెలిపింది.