670 పేజీలుండే 'సింప్లీ ఫ్లై' బుక్‌ను దర్శకురాలు సుధ రెండు గంటల సినిమాగా మలిచి మంచి విజయం సాధించింది. ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. ఉత్తమ నటుడు, నటి, దర్శకురాలు/దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాలలో ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలిచినట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు.
తాజాగా ఆస్కార్స్ వారు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 366 ఉత్తమ చిత్రాల తుది జాబితాని ప్రకటించగా, ఇందులో మన దేశం నుండి సూరరై పోట్రు నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. తుది జాబితాలోని విజేత చిత్రాలను వచ్చే మార్చ్ 15న ప్రకటించనున్నారు. మార్చి 5 నుండి 10 మధ్య అకాడమీ వారు ఓటింగ్ నిర్వహించి విజేతలను తెలియజేయనున్నారు.