పాలులో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డి, విటమిన్ బి-12 వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పాలు తాగితే కలిగే ఇతర ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము.
పాలలో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి
పాలు దంతాల ఎనామిల్‌ను బలపరుస్తాయి. దంతాలు కుళ్లకుండా కాపాడతాయి.
పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.
పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
పాలు చర్మాన్ని మృదువుగా, మెరిసిపోయేలా చేస్తాయి. ఇది ముడతలు పడకుండా నిరోధిస్తుంది.
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వెచ్చని పాలు తాగితే నిద్ర బాగా పడుతుంది.