ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కుస్తీ పోటీల నేపథ్యంలో నడిచే కథ ఇది. నేటి సమాజంలో స్త్రీ ప్రాధాన్యతను చాటి చెప్పే చిత్రమిది. నాలుగు పాటలు, ఫైట్స్‌లతో కొనసాగే రెగ్యులర్ చిత్రం కాదు. కమర్షియాల్ అంశాలు వుంటూనే సమాజానికి చక్కని సందేశాన్ని మేళవించి రూపొందించిన చిత్రమిది అన్నారు.
కథానాయిక లక్ష్మీరాయ్ మాట్లాడుతూ తెలుగులో మంచి చిత్రం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో రమణ మొగిలి చెప్పిన ఈ కథ నన్ను ఎంతో ఆలోచింపజేసింది. ఒకవేళ ఈ చిత్రం చేయకపోతే నా కెరీర్‌లో ఓ మంచి చిత్రాన్ని కోల్పోయేదాన్ని. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఈ సినిమా ఎంతో ఉపయోగపడింది. ఈ చిత్రంలో నా పాత్ర బార్‌గర్ల్‌గా ప్రారంభమై సమాజంలో మహిళలు గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎలా ఎదిగింది అనేది ఎంతో ఆసక్తికరంగా వుంటుంది అన్నారు. యానిమల్ తరువాత ఈచిత్రంలో మళ్లీ ఓ మంచి పాత్రను చేశానని, ఈ సినిమాలో తన పాత్ర నలుగురు చెప్పుకునేంత గొప్పగా వుంటుందని శక్తికపూర్ తెలిపారు.