రష్మికతో ఇంకా టచ్‌లోనే ఉన్నానని రక్షిత్ శెట్టి తెలిపారు. నేను, రష్మిక మేం మెసేజ్‌లు పంపేవాళ్లం. కానీ రెగ్యులర్ కాదు. నా సినిమా విడుదలైనప్పుడల్లా ఆల్ ది బెస్ట్ విషెస్ అంటూ మెసేజ్ పంపుతుంది. ఆమె సినిమా ఎప్పుడు రిలీజైనా నేను కూడా కోరుకుంటాను. మేము పుట్టినరోజులలో ఒకరికొకరు సందేశాలు పంపుకుంటాము.
రష్మిక, రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ప్రేమాయణం సాగిస్తోందని చాలా కాలంగా రూమర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ చాలా సార్లు కలిసి కనిపించారు. అయితే ఈ విషయంపై ఎన్ని రూమర్స్ వస్తున్నా స్పందన లేదు. విజయ్ - రష్మిక కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు