చిన్నోడైనా ఫర్లేదు... మనసుకు నచ్చితే చాలు : రకుల్ ప్రీత్ సింగ్

గురువారం, 9 మే 2019 (15:02 IST)
టాలీవుడ్‌లో ఐరెన్ లెగ్ అనే ముధ్ర వేయించుకున్న హీరోయిన్లలో రకుల ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె ప్రస్తుతం టాలీవుడ్ మన్మథుడు నాగార్జునతో కలిసి నటిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలోకి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో అడుగుపెట్టినప్పటికీ.. ఆమె ఖాతాలో సరైన హిట్ పడలేదు. అయినప్పటికీ వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. 
 
ఈ క్రమంలో రకుల్ ఇప్పుడు తన సెకండ్ ఇన్సింగ్ కోసం తెగ ట్రై చేస్తోంది.  మన్మథుడు 2 మూవీలో నాగ్ తో రోమాన్స్ చేస్తోంది. మరో వైపు తమిళ మూవీస్‍‌లో కూడా బిజీ అయింది. కొత్త ఆఫర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోజులతో ఫోటోలను పోస్ట్ చేసింది. రకుల్  కొన్ని విషయాల్లో బోల్డ్ గా మాట్లాడుతూ సన్సేషన్ సృష్టిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఆమె తన ప్రేమ గురించి స్పందిస్తూ, ప్రేమకు వయసుతో సంబంధం లేదు. తన కన్న చిన్న వాడైన నచ్చితే రోమాన్స్ చేస్తానంటోంది. నచ్చిన వాడు దొరకాలే కానీ వెంటనే ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని చెబుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు