దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా వార్తల్లో నిలిచారు. నట్టి క్రాంతి, కరుణ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సీఐ నిరంజన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు అందించారు వర్మ. మా ఇష్టం సినిమా సమయంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు వర్మ పేర్కొన్నారు.
2020 నవంబర్ 30న తన లెటెర్ హెడ్ తీసుకుని నకిలీ పత్రాలు సృష్టించారని.. అందులో తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఆరోపించారు. ఫోర్జరీ సంతకంతో వారికి డబ్బులు ఇవ్వాల్సి వున్నట్లు సృష్టించారన్నారు. ఫోర్జరీ సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబుకు పంపి నిజానిజాలు తేల్చాలని కోరారు. ఏప్రిల్లో డేంజరస్ సినిమా విడుదల కావాల్సిందని.. నకిలీ పత్రాలతో దావా వేసి సినిమా అడ్డుకున్నారని ఆయన పోలీసులకు వివరించారు.
మరోవైపు ఇటీవల రామ్ గోపాల్ వర్మపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. శేఖర్ రాజు అనే వ్యక్తి దగ్గర వర్మ 56 లక్షల రూపాయలు తీసుకున్నాడని, ఈ విషయంలో డబ్బులు తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారని శేఖర్ రాజు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.