తమిళ మహిళా యంగ్ డైరెక్టరుకు అవార్డుల పంట

శనివారం, 14 మే 2022 (07:28 IST)
"కన్నిలే ఇరుపదెన్న" వంటి ఫీచర్ ఫిల్మ్‌ను తెరకెక్కించిన తమిళ యంగ్ ఫీమేల్ డైరెక్టర్ బహిని దేవరాజ్‌కు వివిధ అంతర్జాతీయ వేడుకలపై అనేక అవార్డులు వరిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 20కి పైగా అవార్డులను ఆమె దక్కించుకున్నారు. ఈలం తమిళం సంతతికి చెందిన బహిని ఆస్ట్రేలియా జన్మించారు. 
 
గత 2018లో ఆస్ట్రేలియాలో ప్రముఖ తమిళ నిర్మాత సినీ కుమార్ నిర్మాణ సారథ్యంలో ఓ చిత్రాన్న తెరకెక్కించారు. కానీ, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఇదిలావుంటే, బహిని తన సొంత నిర్మాణ సంస్థ సాయిబాబా ప్రొడక్షన్ బ్యానరులో పలు చిత్రాలను కూడా నిర్మించారు.
 
ఇటీవల తమ నుంచి దూరమైన తండ్రి జ్ఞాపకార్థం దేవరాజ్ పేరుతో ఓ స్టూడియోను ప్రారంభించారు. ఈ బ్యానరులో కన్నిలే ఇరుపదెన్న చిత్రాన్ని కూడా నిర్మించారు. ఇందులో ఫిరోజ్ బాషా, అరుణ, కేఆర్ ఇళంగో, శ్రీవిద్య అశోక్ వంటి వారు నటించారు. ఈ చిత్రానికి పారీస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ వేడుకల్లో బెస్ట్ ఒరిజిన్ స్క్రీన్ ప్లే అవార్డు వరించింది. 
 
అలాగే, కన్నిలే ఇరుపదెన్న చిత్రం కూడా బెస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. వెస్ట్రర్న్ కెనడియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్డ్ డైరెక్టర్, బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ అవార్డులను కైవసం చేసుకుంది. ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును, స్టార్ హాలీవుడ్ అవార్డుల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌తో పాటు.. బహిని దేవరాజ్‌కు బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా వరించింది.
 
లండన్ ఐఎంఎఫ్ ఫెస్టివల్‌‍లో ఈ చిత్రం మొత్తం యూనిట్‌కు బెస్ట్ యాక్టింగ్ అవార్డు వరించింది. తమిళ చిత్రపరిశ్రమలోని అతిపిన్న వయస్సు మహిళా దర్శకుల్లో బహిని ఒకరు. ఇటీవల చెన్నై పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆమె ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కులను విక్రయించేందుకు చర్చలు జరుగుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు