టాలీవుడ్‌కి శివ.. ఆన్‌లైన్‌ థియేటర్‌కి ''పవర్ స్టార్''.. అది తెలిస్తే గుండె ఆగి చస్తారు..?!

సోమవారం, 27 జులై 2020 (10:19 IST)
పవర్ స్టార్ సినిమానే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. తాజాగా ఈ సినిమా వసూళ్ళ వర్షం కురిపిస్తోందట. రామ్‌గోపాల్‌ వర్మ 'పవర్‌ స్టార్' సినిమా జూలై 25న ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్స్‌ పతాకంపై ఆన్‌లైన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పవర్‌ స్టార్‌ వసూళ్ళు అద్బుతంగా వస్తున్నాయని, ఆ వివరాలు చెబితే గుండె ఆగి చస్తారని చెప్పట్లేదని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్తున్నారు. 
 
టాలీవుడ్‌కి శివ సినిమా లాగా.. ఆన్‌లైన్ థియేటర్‌కి 'పవర్ స్టార్' మూవీ అలా అని ట్వీట్‌ చేశాడు. ఇక పవర్‌ స్టార్‌ సినిమా చూడటానికి 150 రూపాయలు ధర నిర్ణయించిన వర్మ సోమవారం నుండి రూ. 250కి పెంచారు. 
 
ట్యాక్స్‌లతో కలిపితే రూ. 295 అవుతుంది. అంతేగాకుండా వసూళ్లను చూసి పవన్ సినిమాలను కొనసాగిస్తానని వర్మ బాంబు పేల్చారు. పవర్ స్టార్ సినిమాను కంటిన్యూగా చేస్తానని స్పష్టం చేశారు. ఇకపై సీక్వెల్స్‌ వస్తూనే ఉంటాయని ఆర్జీవీ సంచలనం రేపాడు. పవర్‌ స్టార్‌ సినిమాలోని పాత్రలతో ఆ సినిమాలు వుంటాయని, వివరాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపాడు. 
 
ఇక వర్మ తాను పవన్‌ కళ్యాణ్‌ మంచి కోరుకునే వ్యక్తినంటూ పవర్‌ స్టార్‌ సినిమాలో చూపించాడు. పవన్‌ కళ్యాణ్‌ పేరును వాడుకొని ఎంతో మంది హిట్‌లు కొట్టారు, అలానే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. వర్మ మాత్రం వాడుకోవడంలో తన స్టైల్‌ వేరంటూ నిరూపించాడు రామ్ గోపాల్ వర్మ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు