ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రి వైద్యులు అసాధారణ విషయాన్ని సునాయాసంగా ఆపరేషన్ ద్వారా సాధించారు. 33 ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తుల నుండి ప్లాస్టిక్ పెన్ క్యాప్‌ను విజయవంతంగా తొలగించారు. ఆ వస్తువు 26 సంవత్సరాలుగా అక్కడే ఉంది. ఈ రోగి కేవలం 7 సంవత్సరాల వయసులో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పెన్ క్యాప్‌ను మింగేశాడు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఊపిరితిత్తుల్లో ఇన్నేళ్ల పాటు పెన్ క్యాప్ వున్నా.. ఎలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోలేదు. అయితే, ఇటీవల, అతను నిరంతర దగ్గుతో బాధపడటం ప్రారంభించాడు. అతని కఫంలో రక్తం జాడలను గమనించాడు.