గిరిజన కుటుంబాలకు సహాయం అందించిన రానా దగ్గుబాటి
బుధవారం, 9 జూన్ 2021 (19:04 IST)
Rana kovid releif
`అరణ్య` సినిమాలో గిరిజన కుటుంబాల బాగుకోసం రానా ఏం చేశాడో తెలిసిందే. రియల్ లైఫ్‌లో కూడా కొన్ని కుగ్రామాల ప్రజలను కరోనా సమయంలో అండగా వున్నారు. కోవిడ్ -19 సెకండ్‌వేవ్ సమయంలో నిత్యావసరాల కొరత ఒక ప్రధాన సమస్యగా మారింది. ఇలాంటి తరుణంలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి 400 గిరిజన కుటుంబాలను రక్షించడానికి ముందుకు వచ్చారు. ఈ మహమ్మారి సమయంలో ప్రాథమిక అవసరాలకు కూడా ఇబ్బందులు పడుతున్న నిర్మల్ జిల్లాలోని గిరిజన కుటుంబాలకు తనవంతు సహాయం చేశారు రానా. గ్రామాల మొత్తం సమూహంలోని ప్రజలకు అవసరమైన కిరాణా సామాగ్రి మరియు మందులు అందించారు.
rana vovid relief girijanas
అల్లంపల్లి, బాబా నాయక్ రాండా గ్రామ పంచాయతి గుర్రం మధిర, పాల రేగడి, అద్దాల తిమ్మపూర్, మిసాల భూమన్న గూడెం, గగన్నపేట, కనిరాం తాండా, చింతగూడెం, గోంగూరం గూడ, కడెం మండలాలతో కూడిన కుగ్రామాలకు రానా ఈ సహాయం అందించారు.
రానా దగ్గుబాటి నటించిన అరణ్య లాక్‌డౌన్ ముందు రిలీజైంది. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో `అయ్యప్పనుమ్ కోషియం` తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ఇవే కాకుండా విరాటపర్వం సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా నిలిపివేసిన విషయం తెలిసిందే..త్వరలో ఈ సినిమాలకు సంబంధించిన వివరాలు ప్రకటించనున్నారు.