రానా దగ్గుబాటి, విష్ణు విశాల్ హీరోలుగా నటించిన చిత్రం "అరణ్య". తమిళంలో 'కాడన్'. హిందీలో 'హథీ మేరీ సాథీ. ఇలా మూడు పేర్లతో మూడు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించగా, ఈ నెల 26వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే, ఇపుడు హిందీ రిలీజ్‌ను వాయిదా వేశారు.
కొవిడ్19 మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. తెలుగులో అరణ్య, తమిళంలో కాదన్ యధావిధిగా మార్చి 26న విడుదలవుతాయని స్పష్టం చేసింది.