రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతోన్న ఆర్.సి. 16 సినిమా షూటింగ్ హైదరాబాద్ లో బూత్ బంగ్లాలో జరుగుతోంది. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్ లో క్రికెట్ కు సంబంధించిన మ్యాచ్ లు జరుగుతున్నాయని తెలిసింది. ఐదు టీమ్ లుగా ఏర్పడిన ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. రామ్ చరణ్ ఫీల్డులోకి వచ్చేముందు పెద్ది.. పెద్ది.. అంటూ ఆనందంతో కేకలు వేయడం జరిగింది. నైట్ లో నే షూట్ జరుగుతున్నందున నిన్న రాత్రి రామ్ చరణ్ తన కుమార్తె క్లింకారాను తీసుకుని సెట్ లోకి వచ్చారు. అక్కడ నైట్ లైట్ ల ఎఫెక్ట్‌లు చూపిస్తూ కుమార్తె ఆనందించడంతో ఖుషీ అయ్యాడు.