వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న, ఓ గొప్ప మనసున్న మహిళను.. ఒక పోకిరి ఎలా దూషించాడో రష్మీ షేర్ చేసిన వీడియో చూస్తే.. సభ్య సమాజం తలదించుకోక మానదు. పైగా ఆ పోకిరి తల్లిదండ్రులు కూడా వాడి పక్కనే ఉండటం ఈ వీడియోలో ఉన్న మరో విశేషం.
మా వీధి కుక్కలకు మీరెవరు ఫుడ్ పెట్టడానికి అనేలా.. ఫుడ్ పెట్టడానికి వచ్చిన మహిళపై గొడవ పెట్టుకున్న ఆ పోకిరి.. ఆ మహిళను 'లం*' అని దూషించడమే కాకుండా.. తన కాలికున్న చెప్పు తీసి విసిరి కొట్టాడు. నిజంగా సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఆ పోకిరి అలా చేశాడో తెలియదు కానీ.. మహిళ ఇంకా ఇలాంటి పరిస్థితులనే అనుభవిస్తుందని రష్మీ వంటి మహిళలు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఘటనపై మండిపడుతున్నారు.