సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాతలుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం `అప్పుడు-ఇప్పుడు`. శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లొ నటిస్తున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది . ఇటీవల కె. రాఘవేంద్రరావు విడుదలైన పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. లేటెస్ట్ గా మూవీ టీజర్ ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు.