ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మొహ్మద్ ఇబ్రీమ్ అల్ ఖహ్‌తాని హాజరుకాగా, ముల్క్ హోల్డింగ్స్ ఛైర్మన్ నవాజ్ షాజీ వుల్ ముల్క్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. అలాగే, ఫోనెక్స్ ఇంటర్నేషనల్ గ్రూపు ఆఫ్ కంపెనీస్ సీఈఓ సామి సయ్యద్, మార్క్ టెక్నాలజీస్ సీఈవో సురేష్ సి పిళ్లైలు కూడా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అలాగే, ఇండియన్ టెలివిజన్ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్ చీఫ్ అనిల్ వాన్వారికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు, ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా అవార్డును మాజీ ఆర్ట్ ఎడిటర్, విన్నింగ్ మేనేజ్‌మెంట్ కాన్సెప్ట్ ఎల్ఎల్పీ మేనేజింగ్ పార్ట్‌నర్ రత్నోత్తమ సెంగుప్తకు అందజేశారు.
సోషల్ వెల్ఫేర్ విభాగంలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును సన్మార్గ్ చీఫ్ సబ్ ఎడిటర్ కమలేష్ పాండేకు ఇచ్చారు. అలాగే, ఇండీవుడ్ మీడియా ఎక్స్‌లెన్స్ అవార్డులను నాలుగు విభాగాల్లో అందజేశారు. ఈ అవార్డులను పలువురు పేరొందిన జర్నలిస్టులు అందుకున్నారు.