భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ సందర్భంగా ఈరోజు మద్యహ్నం 2గం నుంచి రాత్రి 11గం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఎస్.పి. కార్యాలయంలో తెలియజేసింది. పవన్ కళ్యాణ్, రానా నటించిన ఈ సినిమాకు కె.సి.ఆర్. తనయుడు ఐ.టి. మంత్రి కె.టి.ఆర్. రావడంతో ఈ ఆంక్షలు విధిస్తున్నారు. శ్రీనగర్ కాలనీ నుంచి యూసుఫ్గూడా, ఫిలింనగర్, కృష్ణనగర్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ కు వెళ్ళానుకున్నవారికి మరోవైపు మార్గం నిర్దేశించారు. దీనితో ఆ చుట్టుపక్కల సామాన్యులు కాస్త ఇబ్బంది పడినా తప్పదని పహారా కాస్తున్న పోలీసులు తెలియజేస్తున్నారు. అత్యవసరంగా అంబులెన్స్ సేవలు మాత్రం అనుమతిస్తున్నారు.