అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ.. మైఖేల్ ఫస్ట్ సింగిల్‌ను విడుదల తేదీని ప్రకటిస్తూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసారు నిర్మాతలు. ఫస్ట్ సింగిల్ 'నువ్వుంటే చాలు' డిసెంబర్ 28న విడుదల కానుంది. పోస్టర్ లో సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్ రొమాంటిక్ గా, చూడముచ్చటైన కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. సామ్ సిఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ లీడ్ పెయిర్ ల బ్యూటీఫుల్ రొమాంటిక్ నంబర్‌గా ఉంటుందని సులభంగా ఊహించవచ్చు. తెలుగు, తమిళ భాషల్లో ఈ పాటను విడుదల చేయనున్నారు.
స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కిరణ్ కౌశిక్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.
తారాగణం: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్,అనసూయ భరద్వాజ్ తదితరులు
సాంకేతిక విభాగం:దర్శకత్వం: రంజిత్ జయకొడి, నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు, సమర్పణ: నారాయణ్ దాస్ కె నారంగ్, సంగీతం: సామ్ సిఎస్, డీవోపీ: కిరణ్ కౌశిక్
డైలాగ్స్: త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ : కె. సాంబశివరావు