ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ 'సర్కారు వారి పాట' సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు సమకురుస్తున్నాయి. ఆర్ మది సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరి స్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపడుతున్నారు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.