రానా రిలీజ్ చేసిన త్రిశంకు లోని ఏడు రంగుల వీడియో సాంగ్

బుధవారం, 16 జూన్ 2021 (17:48 IST)
Aman, prachi
స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్ సోద‌రుడు అమన్ ప్రీత్ సింగ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `త్రిశంకు`. ప్రాచి తెహ్లాన్, రష్మీ గౌతమ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సుమ‌న్‌, మహేష్ ఆచంట, నవీన రెడ్డి కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు. శ్రీ కృష్ణ గొర్లె దర్శకత్వంలో గణేశ్ క్రియేష‌న్స్‌, ఎ.యు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై లండన్ గణేష్, నల్ల అయ్యన్న నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల‌ మూవీ నుండి ఫ‌స్ట్ లిరికల్ సాంగ్ ‘ఏడు రంగుల ఓ ఇంద్ర‌ధ‌నస్సులా’ ను టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్ష‌లు తెలిపారు. రాహుల్ సిప్లిగంజ్ఆలపించిన ఈ పాటకి సునీల్ క‌శ్య‌ప్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. భాష్యశ్రీ సాహిత్యం అందించారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ కృష్ణ గొర్లె మాట్లాడుతూ, ఈ సినిమా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రతి పాత్ర ఎంతో చక్కగా రూపుదిద్దుకుంది. అడగ్గానే ఈ చిత్రంలోని పాటను విడుదల చేయటానికి ఒప్పుకున్న హీరో దగ్గుబాటి రానా గారికి ధన్యవాదాలు తెలిపారు.
 
నిర్మాతలు మాట్లాడుతూ, దర్శకుడు శ్రీ కృష్ణ చెప్పిన పాయింట్ ఎంతో బాగా నచ్చింది. ఈ సినిమాలో మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. చిత్రం ఎంతో బాగా వచ్చింది. మా చిత్రంలోని తొలి పాటను విడుదల చేసిన  రానా గారికి కృతజ్ఞతలు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను వెల్లడిస్తాం అన్నారు. ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్: హరి అయినీడి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు