16న సోలోగా Rgv "దెయ్యం"

మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (16:47 IST)
Varma, swati, jevita, natti
నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, పెగాసస్ సినీ కార్ప్ యల్.యల్.పి పతాకాలపై రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ నటీనటులుగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జీవిత రాజశేఖర్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, బోగారం వెంకట శ్రీనివాస్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం‘Rgv దెయ్యం’ .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఈనెల 16న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదలకు సిద్ధమవుతుంది.
 
ఈ సందర్భంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ,. దెయ్యం  సినిమా ఇంతకాలం ఆగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రదానంగా చెప్పాలంటే నేను జీవిత గారు ఈ సినిమా గురించి అనుకున్నప్పుడు రాజశేఖర్ గారు వేరే సినిమాలో బిజీగా వున్నారు. తిరిగి వారు నా దగ్గరకి వచ్చేసరికి నేను బాంబయ్ లో వేరే సినిమాలో బిజీగా వున్నా.ఇద్దరం వేరే వేరే చిత్రాలతో బిజీ వున్నందున ఆలస్యం అవడానికి ప్రధాన కారణమైందని అన్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్ గారి కూతురు పాత్రలో స్వాతి నటించింది. చాలా అద్భుతమైన నటనను కనపరచింది. ఈ చిత్ర టైటిల్ మొదటి దాని కంటె మార్పు చేయడం జరిగిందని అన్నారు.
 
హీరోయిన్ స్వాతి మాట్లాడుతూ, నేను ఈ మూవీ కోసం చాలా కాలం నుండి ఎదురు చూశాను. చిత్రం ఆలస్యం అయ్యినందుకు కాస్త నిరాశ పడినప్పటికీ ప్రస్తుతం విడుదల అవుతున్నందుకు చాలా అనందంగా ఉంది. ఈ చిత్రం మీ అందరికీ తప్పక నచ్చుతుందని బావిస్తున్నాను.ఈ చిత్రం కోశం గత చిత్రాల కంటే ఎక్కువ కష్ట పడ్డాను. మా మూవీ చూశాక కరోనా కు బయపడడం మానేసి దెయ్యనికి భయపడతారని తెలిపింది.
 
జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ, మా కుటుంబ అందరూ కరోనాతో తగిన జాగ్ర‌త్తలు తీసుకొని జీవనం కొనసాగించాలి. ఇంత కాలానికి మా "దెయ్యం" మూవీకి  మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నాను. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ మా దెయ్యం సినిమా చూడాలని కోరుతున్నాను.
 
నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ, దెయ్యం సినిమా కంటెంట్ చాలా బాగుంది. తప్పకుండా హిట్ అవుతుందని పూర్తి నమ్మకం ఉంది.16వ తేదీన మేము థియేటర్ లలోకి మా సినిమా సోలోగా వస్తుందని తెలిపారు.
 
 తారాగణం: 
రాజశేకర్, స్వాతి దీక్షిత్, తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ తదితరులు
 
 సాంకేతిక నిపుణులు 
బ్యానర్ : నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, పెగాసస్ సినీ కార్ప్ యల్.యల్.పి దర్శకుడు: రామ్‌గోపాల్ వర్మ 
నిర్మాతలు :జీవిత రాజశేఖర్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, బోగారం వెంకట శ్రీనివాస్
లైన్ నిర్మాతలు: కొమ్మురి ప్రేమ్‌సాగర్, జె సాయి కార్తీక్ గౌడ్ , ఎడిటర్: సత్య, అన్వర్ 
కెమెరా సతీష్ ముత్యాల, సంగీతం: డిఎస్ఆర్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు