ప్రేమ లేనిదే లోకమే లేదంటారు. ప్రేమ అనేది అందరికీ కామనే. ప్రేమకు వయసంటూ వుండదంటారు. ప్రేమకు కళ్లు లేవంటారు. ఇలా ప్రేమకు ఎన్నెన్నో నిర్వచనాలు వున్నాయి. పేదలు, ధనవంతులు తారతమ్యం లేకుండా ప్రేమ అందిరిలోనూ చిగురిస్తుంది. అందుకు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ వీడియోనే నిదర్శనం.
ఈ వీడియోలో రోడ్డుపై నివసించే బాలబాలికల ప్రేమకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఫుట్ పాత్‌లపై నివసించే ఆ బాలిబాలికలు చూసేందుకు మాసిన బట్టలతో కనిపిస్తున్నారు.
అయితే గొప్ప ప్రేమికులకు తాము తీసిపోమన్నట్టు.. రోడ్డుపై రొమాన్స్ చేసుకుంటూ కనిపించారు. వీరి రొమాన్స్ వీడియోను ఎవరో వీడియో తీసి నెట్టింట పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
My Friend: Vadiki Kuda Lover Undi Kadara????
Me: Vallu Love Cheskunnake Ala Ayipoyara???????? pic.twitter.com/7H7tuLAFVG