వెంటనే సుధీర్ నేను హలో అంటే మీరు నమస్తే అంటారేంటి అని అడగటం.. వెంటనే మహేశ్వరి నేను నీతో చేయి కలిపితే నువ్వు పులిహోర కలుపుతావని కౌంటరిచ్చింది. అనంతరం సుధీర్ మాట్లాడుతూ.. మేడమ్ నన్ను ఎక్కడ వుండమంటారు అని అడిగాడు. వెంటనే మహేశ్వరి నాకు మాత్రం దూరంగా వుండు అంటూ సెటైర్ విసిరింది. ఇలా సుధీర్‌పై మహేశ్వరి వేసిన పంచ్‌లకు అంతా నవ్వుకున్నారు. ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.