తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన సంచలన చిత్రం బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ ఎంత అద్భుతంగా నటించిందో అందరికీ తెలిసిందే. అసలు... ఈ పాత్రకు ముందుగా అతిలోక సుందరి శ్రీదేవిని అనుకోవడం.. ఆమె అంగీకరించకపోవడంతో రమ్యకృష్ణను సంప్రదించడం అందరికీ తెలిసిన విషయమే.
తాను ఆ సమయంలో శ్రీదేవితో స్వయంగా మాట్లాడానని... గొప్ప సినిమా అని, అవకాశం వదులుకోవద్దని చెప్పానని... నేను అలా చెప్పడంతో శ్రీదేవి ఆసక్తి కూడా చూపింది. కానీ, బోనీకి మాత్రం ఇష్టం లేదని... దీంతో, రెమ్యునరేషన్‌ను భారీగా డిమాండ్ చేసి, 'బాహుబలి'లో శ్రీదేవి నటించకుండా చేశారని తెలిపారు. బోనీ కపూర్ నిర్ణయాల వల్ల కెరీర్ పరంగా శ్రీదేవి చాలా నష్టపోయారని చెప్పారు. మరి...వర్మ మాటల గురించి బోనీ స్పందిస్తారేమో చూడాలి..!