మొలకెత్తిన బంగాళాదుంపలు సురక్షితం కాదని చెబుతారు.
బంగాళాదుంపలకు మొలకెత్తిన రెమ్మలలో గ్లైకోఅల్కలాయిడ్స్ ఉంటాయి.
ఇలాంటి వాటిని పెద్ద పరిమాణంలో తినడం వల్ల ప్రాణానికి ముప్పు వాటిల్లవచ్చు.
బంగాళాదుంపలు మొలకెత్తడం ప్రారంభించినప్పుడు, గ్లైకోఅల్కలాయిడ్స్ స్థాయిలు పెరగడం ప్రారంభిస్తాయి.
ఇలాంటి వాటిని తినడం వల్ల వాంతులు, విరేచనాలు, వికారం వస్తాయి.
మొలకెత్తిన లేదా ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను ఉపయోగించకపోవడమే మంచిది.
బంగాళాదుంపలను చల్లని, చీకటి ప్రదేశంలో నిల్వ చేయాలి.
ఉల్లిపాయల దగ్గర పెట్టకూడదు, వాటి నుండి వచ్చే వాయువు బంగాళాదుంపలు వేగంగా మొలకెత్తడానికి కారణమవుతుంది.