టాలీవుడ్ హీరో 'సుమంత్' ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌పై అసహనం వ్యక్తం చేసారు. కాల్ డ్రాప్ సమస్యతో కస్టమర్లు విసిగిపోతున్నారని సోషల్ మీడియాలో వ్యంగ్యంగా చురకలంటించారు. కాల్ డ్రాప్ సమస్యకు ఎయిర్టెల్ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్‌గా మారింది.
నెటిజన్లు కూడా ఈ ట్వీట్‌కి స్పందిస్తూ తగు రీతిలో సెటైర్లు విసురుతున్నారు. యువకుడు, గోదావరి, గోల్కొండ హైస్కూల్ చిత్రాలతో ఆకట్టుకున్న సుమంత్.. చాలా గ్యాప్ తర్వాత గతేడాది 'మళ్లీ రావా' అనే సినిమాలో నటించి, మంచి విజయం అందుకున్నారు. మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఈ హీరో తన తదుపరి చిత్రం ఎప్పుడు ఉంటుందో మాత్రం ఇంకా వెల్లడించలేదు.