సునీల్‌ బిజీ అయ్యాడు.. బిందాస్‌ ఫేమ్ వీరు పోట్లతో ఈడు గోల్డ్ ఎహే!

శుక్రవారం, 6 మే 2016 (10:45 IST)
కమేడియన్‌ నుంచి హీరోగా ఎదిగిన సునీల్‌ ప్రస్తుతం బిజీ అయ్యాడు. ఇటీవలే కొంత గ్యాప్‌ తీసుకున్న తను సరైన కథకోసం వేచిచూసి ఇప్పుడు వాటికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. 'అందాల రాముడు', 'పూలరంగడు', 'మర్యాద రామన్న' లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్‌ హీరోగా 'బిందాస్‌' లాంటి కామెడీ సినిమా తీసిన వీరుపోట్ల దర్శకత్వంలో 'ఈడు గోల్డ్‌ ఎహే' సినిమా రూపొందుతోంది. 
 
ప్రస్తుతం రెండవ షెడ్యూల్స్‌ పూర్తి చెసుకున్న ఈ సినిమా మూడో షెడ్యూల్‌ గురువారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం అవుతున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో సునీల్‌ సరసన్‌ 'మాయ' ఫేం సుష్మా రాజ్‌, రిచా పనయ్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు సాగర్‌ మహతి ఈ సినిమాకు సంగీత దర్శకత్వం అందిస్తుండగా ఏ కే ఎంటర్‌ టైన్మెంట్స్‌ ఇండియా పై. లిమిటెడ్‌ బానర్‌ ఈ సినిమాని నిర్మిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి