జాట్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్

దేవి

మంగళవారం, 11 మార్చి 2025 (20:22 IST)
Sunny Deol, Randeep Hooda, Vineet Kumar Singh
సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ ప్రధాన తారాగణం తో రూపొందుతున్న చిత్రం జాట్. హైదరాబాద్ శివారలో షూట్ జరుగుతుంది. నేడు సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ తో ప్రమోషన్ చిత్ర యూనిట్ ప్రారంభించింది. యాక్షన్ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన వీరిపై నేడు కీలక సన్నివేశాలు తీశినట్లు తెలిసింది. అందులో భాగంగా IndianIdol యొక్క ప్రత్యేక ఎపిసోడ్ కోసం నేడు చిత్రీకరించారు. ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.
 
ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని రచన,  దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్,  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి  నిర్ఈమిస్తున్నారు. ఈ  చిత్రంలో ప్రశాంత్ బజాజ్, సయామీ ఖేర్,  రెజీనా కసాండ్రా తదితరులు  నటిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. సయామి ఖేర్ రిషి పంజాబీ, ఆర్ట్‌కోల్లా నవీన్‌నూలి, మాక్స్‌మీడియాసాయి సాంకేతిక సిబ్బంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు