పునీత్ సమాధి వద్ద కన్నీరుకార్చిన హీరో సూర్య (Video)

శుక్రవారం, 5 నవంబరు 2021 (15:32 IST)
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇటీవల హఠాన్మరణం చెందారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనలేని అనేక మంది సినీ సెలెబ్రిటీలు ఇపుడు నేరుగా ఆయన అన్న శివరాజ్‌కుమార్ లేదా పునీత్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. 
 
అలాంటి వారిలో హీరో సూర్య ఒకరు. ఆయన బెంగళూరు వెళ్లిన సూర్య కంఠీరవ స్టూడియోస్‌లోని పునీత్ సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా సూర్య భావోద్వేగాలను అదుపు చేసుకోలేక కంటతడి పెట్టారు. 
 
అంత్యక్రియలకు రాలేకపోయానంటూ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ కూడా సూర్య వెంట ఉన్నారు. ఆయన కూడా తమ్ముడి మరణం తాలూకు బాధ నుంచి ఇంకా తేరుకోలేదనడానికి నిదర్శనంగా చెమర్చిన కళ్లతో కనిపించారు.
 
కన్నడ చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్‌గా, అప్పుగా అందరి మెప్పు పొందిన పునీత్ రాజ్ కుమార్... భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరితోనూ స్నేహపూర్వకంగా మెలిగేవారు. అందుకే పునీత్‌తో ఉన్న పరిచయం, అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

 

Actor @Suriya_offl pays respect to Puneeth Rajkumar at his memorial earlier today #PuneethRajkumar pic.twitter.com/MCUmxymi0z

— Vishnu (@johnvishnu) November 5, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు